బాల‌య్య ఫస్ట్ రోర్..నెవ‌రో బిఫోర్ లుక్ లో న‌ట‌సింహం..!

balakrishna akhanda movie first roar
balakrishna akhanda movie first roar

నంద‌మూరి బాల‌య్య బోయ‌పాటి కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న బీబీ 3 సినిమా టైటిల్ మ‌రియు ఫ‌స్ట్ రోర్ ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ సినిమాకు ముందు నుండి ప‌లు టైటిల్ లు పరిశీల‌న‌లో ఉన్న‌ట్టుగా వార్త‌లు వ‌చ్చాయి. కానీ తాజాగా అఖండ అనే టిటిల్ ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. టైటిట్ తో పాటు టైటిల్ రోర్ ను కూడా విడుద‌ల చేసింది. ఇక వీడియోలో బాల‌య్య ఇదివ‌ర‌కు ఎన్న‌డూ క‌నిపించ‌ని గెట‌ప్ లో అగోరా పాత్ర‌లో క‌నిపిస్తున్నారు. ఈ లుక్ చూస్తుంటే బాల‌య్య నెవ‌ర్ బిఫోర్ అన్న రేంజ్ లో ఉంది. బాల‌య్య అగోరా లుక్ లో క‌నిపించినా మాస్ స‌న్నివేశాలు మాత్రం ప‌క్కా అని ఈ వీడియోతో అర్థం అవుతోంది.

అంతే కాకుండా బాల‌య్య బోయ‌పాటి కాంబినేష‌న్ లో ఆశించే డైలాగులు కూడా సినిమాలో ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. ఇక ఉగాదికి బాల‌య్య ఫ్యాన్స్ కు అదిరిపోయే స‌ర్ప్రైజ్ ఇవ్వ‌డంతో కుషీ అవుతున్నారు. అంతే కాకుండా ఉద‌యం నుండే త‌మ హీరోను ట్విట్ట‌ర్ లో ట్రెండ్ లోకి తీసుకువ‌చ్చారు. ఇదిలా ఉండ‌గా ఈ సినిమాలో బాల‌య్య స‌ర‌స‌న ప్ర‌గ్నా జైష్వాల్ హీరోయిన్ గా న‌టిస్తోంది. అంతే కాకుండా పూర్ణ ఈ సినిమాలో మ‌రో హీరోయిన్ గా న‌టిస్తోంది. ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్‌పై మిర్యాల రవీందర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.