అఖండ‌కు బాలయ్య రెమ్యున‌రేష‌న్ అంత త‌క్కువా..?

  • Written By: Last Updated:
అఖండ‌కు బాలయ్య రెమ్యున‌రేష‌న్ అంత త‌క్కువా..?

ప్ర‌స్తుతం మ‌న హీరోల రెమ్యున‌రేష‌న్ లే ఒక సినిమా బ‌డ్జెట్ అంత ఉంటున్నాయి. టాప్ హీరోలు సినిమాకు రూ.70 నుండి రూ.50 కోట్ల వ‌ర‌కు డిమాండ్ చేస్తున్నారు. ఇక రెమ్యునేష‌న్ త‌క్కువ తీసుకుంటే లాభాల్లో వాటాలు పుచ్చుకుంటున్నారు. మ‌రోవైపు యావ‌రేజ్ హీరోలు సైతం ప‌దికోట్ల వ‌ర‌కు రెమ్యునేష‌న్ తీసుకుంటున్న‌ట్టు టాక్. అయితే ఇదంతా కేవ‌లం యంగ్ హీరోల రెమ్యునరేష‌న్ లు మాత్ర‌మే సీనియ‌ర్ హీరోల రెమ్యున‌రేష‌న్ లు ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయ‌ట‌. ప్ర‌స్తుతం హీరో నాగార్జున ఒక సినిమాకు రూ. 5 నుండి 6 కోట్ల వ‌ర‌కూ తీసుకుంటున్నార‌ట‌.

ఇక వెంక‌టేష్ ఎఫ్ 3 సినిమాకు బెట‌ర్ అమౌంట్ నే తీసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. అయితే తాజా ఫిల్మ్ న‌గ‌ర్ టాక్ ప్ర‌కారం బాల‌క్రిష్ణ అఖండ సినిమా కోసం రూ.7 కోట్ల రెమ్యున‌రేష‌న్ మాత్రమే తీసుకుంటున్నార‌ట‌. బాల‌య్య రూ.10 కోట్లు డిమాండ్ చేసిన‌ప్ప‌టికీ ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను ఆయ‌న‌ను రూ.7 కోట్ల‌కు ఒప్పించారట‌. మ‌రోవైపు ఈ సినిమాకు బోయ‌పాటి ఎలాంటి రెమ్యున‌రేష‌న్ తీసుకోవ‌డం లేద‌ని టాక్. ఈ సినిమాను నిర్మాత 70 కోట్ల‌తో నిర్మిస్తున్న‌ట్టు తెలుస్తోంది. అయితే సినిమా విడుద‌ల త‌ర‌వాత వ‌చ్చే లాభాల్లో వాటా తీసుకునెలా బోయ‌పాటి ఒప్పందం చేసుకున్నార‌ట‌.

follow us