అనుకున్నట్టే టాలీవుడ్ రికార్డులు బ‌ద్ద‌లు కొట్టిన బాల‌య్య‌..!

  • Written By: Last Updated:
అనుకున్నట్టే టాలీవుడ్ రికార్డులు బ‌ద్ద‌లు కొట్టిన బాల‌య్య‌..!

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌క్రిష్ణ ఊహించిన‌ట్టుగానే టాలీవుడ్ రికార్డులు బ‌ద్ద‌లు కొట్టారు. నంద‌మూరి బాల‌క్రిష్ణ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్ లో అఖండ సినిమా వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో బాల‌య్య నెవ‌ర్ బిఫోర్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాల‌క్రిష్ణ‌కు బోజీగా ప్ర‌గ్యా జైష్వాల్ హీరోయిన్ గా న‌టిస్తోంది. అంతే కాకుండా ఈ సినిమాలో పూర్ణ కూడా కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న‌ట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్ప‌టికే ఈ సినిమా నుండి టీజ‌ర్ ను విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సినిమా టీజ‌ర్ తాజాగా 50 మిలియ‌న్ వ్యూవ్స్ ను క్రాస్ చేసింది.

అంతే కాకుండా టాలీవుడ్ లో ఫాస్టెస్ట్ 50 మిలియిన్ వ్యూవ్స్ క్రాస్ చేసిన టీజ‌ర్ గా అఖండ టీజర్ నిలిచింది. ఇటీవ‌లే ఈ రికార్డును పుష్ప టీజ‌ర్ బ్రేక్ చేయ‌గా ఇప్పుడు పుష్ప‌ను అఖండ బీట్ చేసింది. దాంతో బాల‌య్య అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. అంతే కాకుండా టీజ‌ర్ వ్యూవ్స్ చూస్తుంటే ఈ సినిమాపై అంచ‌నాలు మ‌రింత పెరుగుతున్నాయి. మ‌రోవైపు ఇప్ప‌టికే బాల‌య్య బోయ‌పాటి కాంబినేష‌న్ లో వ‌చ్చిన సింహా, లెజెండ్ సినిమాలు సూప‌ర్ హిట్ గా నిలిచాయి. దాంతో అఖండ పై కూడా భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇక బాల‌య్య థియేట‌ర్ లో ఎన్ని రికార్డులు బ్రేక్ చేస్తారో చూడాలి.

follow us