నందమూరి హీరోలతో రావిపూడి మల్టీస్టారర్..!

బాలక్రిష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై మొదటి నుండి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా చిత్రంపై మరోవార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. సినిమాలో బాలయ్యతో పాటు కల్యాణ్ రామ్ కూడా నటించబోతున్నారట. అంటే నందమూరి హీరోలతో అనిల్ రావిపూడి మల్టీస్టారర్ ను సెట్ చేశారట. ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే బాలయ్యకు కథ వినిపించి ఒప్పించిన అనిల్ రావిపూడి కల్యాణ్ రామ్ ను కూడా ఒప్పించినట్టు తెలుస్తుంది.
నిజానికి అనిల్ రావిపూడికి పటాస్ సినిమాతో అవకాశం ఇచ్చి ఇండస్ట్రీకి పరిచయం చేసిన హీరో కల్యాణ్ రామే. దాంతో కల్యాణ్ రామ్ తో మరో సినిమా చేయాలని రావిపూడి ఎప్పటి నుండో అనుకుంటున్నారట. ఇక మొత్తానికి కల్యాణ్ రామ్ తో పాటు బాలయ్యకు దర్శకత్వం చేసే చాన్స్ కొట్టేశారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం బాలక్రిష్ణ అఖండ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తి కాగానే అనిల్ సినిమాలో నటిస్తారు. ఇక అనిల్ రావిపూడి సైతం అప్పటివరకూ ఎఫ్ 3 సినిమాను పూర్తి చేస్తారు.