తలసానితో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నారా..? : బాలయ్య

సినిమా ఇండస్ట్రీ లో చిరంజీవి పెద్ధదిక్కు అవతారం ఎత్తి మీటింగ్లు నిర్వహిస్తున్నారు.. షూటింగ్స్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి , థియేటర్స్ తెరుచుకోవడం గురించి అలానే కొన్ని ముఖ్య విశేషాల మీద తలసానితో కలిసి మీటింగ్ పెట్టిన విషయం తెలిసిందే..
అయితే బాలకృష్ణ ఈ విషయం పైన గుస్సా అయ్యారు.. మీటింగ్స్ పెట్టుకున్న విషయం నాకు తెలియదు.. తలసాని తో కలిసి అందరూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నారా అంటూ విరుచుకుపడ్డారు.. అలానే నాకు ఏమైనా భయమా మాట్లాడడానికి అని అంటూ సీరియస్ అయిన వీడియో ఇప్పుడు ఒకటి వైరల్ అయ్యింది..
Read Also : బాలయ్య బాబును మేము తక్కువుగా చూడలేదు అంటూనే అవమానించారా..?
సినీ ఇండస్ట్రీ లో సీనియర్ హీరోలు అని చెప్పుకోడానికి టాలీవుడ్ లో ఉన్నది ఐదుగురు.. చిరంజీవి,బాలయ్య ,వెంకటేష్,నాగార్జున, మోహన్ బాబు వాళ్లలోనే కొంత మందిని మిస్ అయితే ఇంకా మీటింగ్ పెట్టుకొని ఎందుకు.. పోనీ వాళ్ళు రాలేదు లేక వేరే ఊరులో ఉన్నారు అంటే వేరే విషయం అసలు ఇన్ఫోర్మ్ కూడా చేయకపోవడం ఏంటి..
అసలు జరిగింది సినిమా మీటింగా లేక ఇండస్ట్రీ గ్రూపులుగా విడిపోయిందని మనకి తెలియచేస్తున్నారా..