ఫ్యాన్సీ రేటుతో “గాడ్ ఫాదర్” ను దక్కించుకున్న దిల్ రాజు.!

balakrishna god father naizam and uttarandra theatrical rights
balakrishna god father naizam and uttarandra theatrical rights

నంద‌మూరి నట‌సింహం బాలక్రిష్ణ బోయ‌పాటి కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న సినిమా “గాడ్ ఫాద‌ర్”. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన అఖిల్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ సాయేషా సైగల్ హీరోయిన్ గా నటిస్తోంది. మరో హీరోయిన్ గా పూర్ణ నటిస్తునట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో కూడా బాలయ్య కోసం బోయపాటి భారీ యాక్షన్ సన్నివేశాలను ప్లాన్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వికారాబాద్ లో జరుగుతున్నట్టు సమాచారం. ఇక ఇప్పటికే బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన సింహా లెజెండ్ సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో “గాడ్ ఫాదర్” పై అభిమానులకు ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉన్నాయి.

దాంతో సినిమాకు ఫ్యాన్సీ ఆఫర్స్ వస్తున్నాయని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఆంధ్ర ప్రాంత థియేట్రికల్ రైట్స్ రూ.35 కోట్లకు అమ్ముడు పోయాయని సమాచారం. అంతే కాకుండా ఈ సినిమా నైజాం, ఉత్తరాంధ్ర హక్కులను ప్రముఖ నిర్మాత డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు రూ.16 కోట్లకు దక్కించుకున్నట్టు సమాచారం. బాలయ్య బోయపాటి సినిమాలకు ఉన్న క్రేజ్ తో ఒక్కో ఏరియా లో డిస్ట్రిబ్యూటర్లు సినిమాను దక్కించుకునేందుకు పోటీ పడుతున్నట్టు సమాచారం.