ఇద్ద‌రు నాయిక‌ల‌తో బాల‌య్య భూం బ‌ద్ద‌ల్..!

  • Written By: Last Updated:
ఇద్ద‌రు నాయిక‌ల‌తో బాల‌య్య భూం బ‌ద్ద‌ల్..!

సాధార‌ణంగా బాల‌య్య సినిమాల్లో ఇద్ద‌రు హీరోయిన్ ల‌తో రొమాన్స్ చేయ‌డం కామ‌న్ గా క‌నిపిస్తుంది. అయితే ఇప్ప‌డు బాల‌య్య గోపిచంద్ మలినేని కాంబినేష‌న్ లో రాబోతున్న సినిమాలోనూ అదే రిపీట్ కాబోతుందంట‌. నిజ‌సంఘ‌ట‌న‌ల ఆధారంగా గోపీచంద్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌బోతున్నాట‌. సినిమాలో బాల‌య్య పోలీస్ ఆఫీస‌ర్ పాత్రో క‌నిపించ‌బోతున్న‌ట్టు గా కూడా తెలుస్తుంది. ఇక‌ ప్ర‌స్తుతం ఈ సినిమా క‌థ పైనే గోపీచంద్ ఫోక‌స్ పెట్టినట్టు స‌మాచారం. అంతే కాకుండా ఈ సినిమాలో బాల‌క్రిష్ణ స‌ర‌స‌న హీరోయిన్ గా ఇద్ద‌రు హీరోయిన్ లు న‌టించ‌బోతున్న‌ట్టు ఫిల్మ్ న‌గ‌ర్ లో టాక్ వినిపిస్తుంది.

అంతే కాకుండా ఓ హీరోయిన్ గా ల‌క్ష్మిరాయ్ ను ఎంపిక చేసిన‌ట్టుగా కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇక క్రాక్ లాంటి సూప‌ర్ హిట్ సినిమా హిట్ త‌ర‌వాత గోపిచంద్ బాల‌క్రిష్ణ‌కు క‌థ‌ను వినిపించ‌గా బాల‌య్య గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ఈ చిత్రానికి మైత్రీమూవీమేక‌ర్స్ వారు నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండ‌గా ప్ర‌స్తుతం బాల‌క్రిష్ణ బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో అఖండ సినిమాలో న‌టిస్తున్నారు. క‌రోనా విజృంభ‌బిస్తున్నా రెస్ట్ తీసుకోకుండా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేస్తున్నారు.

follow us