చిన్నారి పిలుపుకు చలించిపోయిన బాలయ్య

చిన్నారి పిలుపుకు చలించిపోయిన బాలయ్య

నందమూరి బాలకృష్ణ కు కోట్లాదిమంది అభిమానులు ఉంటారనే సంగతి తెలిసిందే. కొంతమంది ఆయన సినిమాలు చూసి అభిమానం పెంచుకుంటే..మరికొంతమంది ఆయన వ్యక్తిత్వం నచ్చి ఆయనపై అభిమానం పెంచుకున్న వారు ఉన్నారు. చిన్న , పెద్ద , ముసలి ఇలా అంతకుడా బాలయ్య ను ఇష్టపడుతుంటారు.

ప్రస్తుతం బాలయ్య సినిమాలతో పాటు అన్‌స్టాపబుల్ షో కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ అన్‌స్టాపబుల్ షో కు ముఖ్య అతిధిగా పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. దీనికి సంబదించిన షూటింగ్ ఈరోజు అన్నపూర్ణ సెట్స్ లో జరిగింది. కాగా పవన్ కళ్యాణ్ కోసం అల్లు అరవింద్, బాలకృష్ణ ముందుగా సెట్స్‌కు చేరుకున్నారు. వీరిద్దరితో పాటు యూనిట్ మొత్తం బయట వేచి చూస్తున్న సమయంలో అక్కడే ఉన్న బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య నుంచి ‘బాలయ్య’ అనే పిలుపు వినిపించింది. ఒక చిన్నారి బాలయ్య అని ప్రేమగా పిలవడాన్ని బాలకృష్ణ గమనించి.. వెంటనే ఆ పాపను తీసుకురావాలని సిబ్బందికి చెప్పారు.

చిన్నారిని ఎత్తుకుని ఆమె తండ్రి బాలయ్య వద్దకు తీసుకెళ్లారు. ఆయన్ని వివరాలు అడిగి తెలుసుకున్న బాలకృష్ణ.. ఆ పాపకు ఆప్యాయంగా ముద్దు ఇచ్చారు. ఈ దృశ్యాన్ని చూసిన నందమూరి అభిమానులు.. ‘‘పాపను పిలిచారు, అదీ బాలయ్య క్యారెక్టర్’’ అంటూ మురిసిపోయారు. ఆ మాటలు వీడియోలో కూడా రికార్డయ్యాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

follow us