నటసింహం బాలకృష్ణ టాలీవుడ్ లో కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ వరుస సినిమాల్లో నటిస్తుంటారు. అంతేకాకుండా కుర్ర హీరోలకు తాను ఎక్కడా తక్కువ కాదని ఊర మాస్ ఫైట్ లు..డ్యాన్స్ లతో అలరిస్తుంటారు. ఇక ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి గాడ్ ఫాదర్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ చిత్రంలో అఖిల్ తో అభిమానులను ఆకట్టుకున్న సాయేషా సైగల్ హీరోయిన్ గా నటిస్తుంది.
ఇప్పటికే బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్స్ అవ్వడంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం మే లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగా ఈ సినిమా తరవాత బాలయ్య బాలీవుడ్ సినిమా “హిందీ మీడియం” రీమేక్ లో నటించబోతున్నారట. హిందీలో ఇర్ఫాన్ ఖాన్, రాధిక మదన్, కరీనా కపూర్ ప్రధాన తారాగణంగా ఈ సినిమా తెరకెక్కింది. అయితే “తెలుగు మీడియం” పేరుతో బాలయ్య రాబోతున్నట్టు తెలుస్తుంది.