పవన్ ఎపిసోడే చివరిదా..?

పవన్ ఎపిసోడే చివరిదా..?

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ 2 అదిరిపోయే రేటింగ్స్ తో దూసుకపోతున్న సంగతి తెలిసిందే. తన కెరీర్ లో ఫస్ట్ టైం హోస్ట్ గా చేస్తున్న బాలయ్య తనదైన శైలిలో దుమ్మురేపుతున్నారు. ప్రముఖ సంస్థ ఆహా ఓటీటీ వేదికగా ప్రసారం అవుతున్న ఈ షో..ప్రస్తుతం రెండో సీజన్ ముంగిపు కు వచ్చినట్లు తెలుస్తుంది. ఈ ఇప్పటికే ఈ సీజన్ లో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై సందడి చేసారు. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో పాటు హీరో గోపీచంద్ హాజరయ్యారు. ఈ ఎపిసోడ్ డిసెంబర్ 30 న స్ట్రీమింగ్ కాబోతుంది. ఇదిలా ఉంటె ఈ సీజన్ కు సంబందించిన మరో న్యూస్ బయటకు వచ్చింది.

ఈ సీజన్ ముగింపు ఎపిసోడ్ పోస్టర్ రిలీజ్ ఈవెంట్ డిసెంబర్ 27న అన్నపూర్ణ మెయిన్ స్టూడియోలో జరనగున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా రాబోతున్నారట. అంతేకాకుండా.. ఈ సీజన్‏కు పవన్ ఎపిసోడ్ చివరిదని తెలుస్తోంది. ఇక త్వరలోనే వీరిద్దరికి సంబంధించిన ఎపిసోడ్ షూట్ జరగనున్నట్లుగా చెపుతున్నారు. మరి ఈ ఎపిసోడ్ లో ఎలాంటి ప్రశ్నలు బాలయ్య వేస్తారో చూడాలి.

follow us