బాలయ్య షో లో ప్రభాస్.. అనుష్క , కృతి లతో డేటింగ్ ఫై…

టాలీవుడ్ లో మోస్ట్ బ్యాచ్లర్ అంటే ప్రభాస్ అనే చెపుతారు. 43 కి వచ్చినప్పటికీ ఇంకా పెళ్లి చేసుకోకుండా కాలం గడిపేస్తున్నాడు. అయితే గత కొద్దీ నెలలుగా అనుష్క – ప్రభాస్ ల మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుందని , పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు చక్కర్లు కొడుతూ వచ్చాయి. కానీ ఈ వార్తలను ఇద్దరు కొట్టిపారేశారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ తో ప్రబస్ డేటింగ్ చేస్తున్నాడని , వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని బాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ వార్తలపై ప్రభాస్..బాలయ్య షో లో క్లారిటీ ఇచ్చారనే వార్తలు ప్రస్తుతం ఫిలిం సర్కిల్లో వినిపిస్తుంది.
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షో అదిరిపోయే రేటింగ్స్ తో దూసుకపోతున్న సంగతి తెలిసిందే. తన కెరీర్ లో ఫస్ట్ టైం హోస్ట్ గా చేస్తున్న బాలయ్య తనదైన శైలిలో దుమ్మురేపుతున్నారు. ప్రముఖ సంస్థ ఆహా ఓటీటీ వేదికగా ప్రసారం అవుతున్న ఈ షో..ప్రస్తుతం రెండో సీజన్ జరుపుకుంటుంది. ఈ ఇప్పటికే ఈ సీజన్ లో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై సందడి చేసారు.
తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో పాటు హీరో గోపీచంద్ హాజరయ్యారు. దీనికి సంబదించిన పిక్స్ సైతం అధికారికంగా ప్రకటించడం జరిగింది. కాగా ఈ షో లో బాలయ్య..అనేక విషయాలను ప్రభాస్ ను అడిగి తెలుసుకున్నాడని అంటున్నారు. ముఖ్యంగా పర్సనల్ విషయాలు , పెళ్లి , డేటింగ్ ఇలా వీటి గురించి కూడా అడిగాడని, వాటికీ ప్రభాస్ క్లారిటీ ఇచ్చారని అంటున్నారు. మరి ఏ ఏ విషయాలకు ఎలాంటి క్లారిటీ ఇచ్చారో తెలియాలంటే ఎపిసోడ్ ప్రసారం అయ్యేవరకు ఎదురుచూడాల్సిందే.