రేపే బాలయ్య 108 మూవీ ఓపెనింగ్

రేపే బాలయ్య 108 మూవీ ఓపెనింగ్

నందమూరి బాలకృష్ణ – అనిల్ రావిపూడి కలయికలో తెరకెక్కబోయే బాలకృష్ణ 108 మూవీ రేపు గ్రాండ్ గా ప్రారంభం కాబోతుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద హరీష్ పెద్ది, సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈరోజు (డిసెంబర్ 7) మంత్రాలయంలోని రాఘవేంద్రస్వామి సమాధి వద్ద సినిమా స్క్రిప్ట్ ఉంచి పూజలు జరిపారు.. ఓపెనింగ్ నాడు అల్లు అరవింద్ క్లాప్, దిల్ రాజు కెమెరా స్విచ్ఛాన్, సుకుమార్ ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేయనున్నారని.. అలాగే నిర్మాతలు శిరీష్, నవీన్ ఎర్నేని (మైత్రీ మూవీస్) స్క్రిప్ట్ అందించనున్నారని సమాచారం.

ఈ మూవీ లో బాలయ్య ఏజ్డ్ క్యారెక్టర్లో కనిపించబోతాడని , ఆయన కు కూతురి గా ‘పెళ్లిసందD’ ఫేమ్ శ్రీలీల కనిపించనుంది. మరో కీలకపాత్ర కోసం ‘టాక్సీవాలా’ బ్యూటీ ప్రియాంక జవాల్కర్‌ని తీసుకున్నారట.. హైదరాబాద్ బాచుపల్లిలో 12 రోజుల పాటు యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించనున్నారని సమాచారం. ప్రస్తుతం బాలకృష్ణ క్రాక్ ఫేమ్ గోపిచంద్ మలినేని డైరెక్షన్లో వీరసింహ రెడ్డి మూవీ చేస్తున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 11 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా , తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

follow us

Web Stories