కరోనా విజృంభిస్తున్నా అఖండకు బ్రేకుల్లేవ్.!

ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ఉదృతి కొనసాగుతుంది. కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో పెద్ద సినిమాలన్నీ షూటింగ్ లను వాయిదా వేసుకున్నాయి. దాంతో హీరోలు హీరోయిన్ ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు. అయితే కరోనా విజృంభిస్తున్నా అఖండ షూటింగ్ ను మాత్రం వేగంగా పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే కరోనాను లెక్క చేయకుండా ఈ సినిమా మూడో షెడ్యూల్ ను పూర్తి చేసారు. అంతే కాకుండా ఇప్పుడు అఖండ నాలుగో షెడ్యూల్ ను కూడా ప్రారంభించబోతున్నారు. ఈనెల 12 నుండి షూటింగ్ ను ప్రారంభించాలని చిత్ర యూనిట్ నిర్ణయించుకుంది.
అయితే కరోనా విజృంభన నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ ను పూర్తి చేయాలనుకుంటున్నారు. అంతే కాకుండా అతితక్కువ మందితో బోయపాటి షూటింగ్ ను ప్లాన్ చేస్తున్నారట. నిజానికి ఈ సినిమా షూటింగ్ వేగంగా పూర్తి చేయడం వెనక మరో కారణం కూడా ఉంది. ఇప్పటికే అఖండ బడ్జెట్ అనుకున్నదానికంటే ఎక్కువ అయ్యిందట. దాంతో చిత్ర యూనిట్ త్వరలో షూటింగ్ ను పూర్తి చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంనే బాలక్రిష్ణ కూడా షూటింగ్ లో పాల్గొనడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.