కోవిడ్ బాధితుల కోసం బాలయ్య గెస్ట్ హౌస్.. !

కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. కేసులు పెరుగుతుండటంతో ఆక్సీజన్ కొరతతో పాటు ఆస్పత్రుల్లో బెడ్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. దాంతో వ్యాపార వేత్తలు సెలబ్రెటీలు సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. తాజాగా నందమూరి బాలయ్య కూడా గొప్ప మనసు చాటుకున్నారు. హిందూపురం లోని తన గెస్ట్ హౌస్ ను కోవిడ్ ఐసోలేషన్ కోసం బాలయ్య ఇచ్చేసారు. ఈ విషయాన్ని బాలయ్య అభిమానులు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఇక కొద్ది రోజుల క్రితం బాలక్రిష్ణ రూ.20 లక్షలతో కరోనాతో బాధపడుతున్నవారికి మందుల సరఫరా చేశారు. ఇక ఇప్పుడు మరోసాయం చేసి వార్తల్లో నిలిచారు.
ఇక బాలక్రిష్ణ ఎమ్మెల్యేగా ప్రజాసేవ చేస్తూనే సినిమాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో అఖండ చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వీరి కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్ వంటి సినిమాలు సూపర్ హిట్ కావడంతో అఖండపై కూడా ప్రేక్షకులకు భారీ అంచనాలున్నాయి, ఈ సినిమా తరవాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య సినిమా ఉండబోతుంది. అయితే దీనిపైఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.