బాలకృష్ణ కు పెను ప్రమాదం తప్పింది

నందమూరి నటసింహం బాలకృష్ణ పెను ప్రమాదం నుండి బయటపడ్డారు. ఈయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లో సాంకేతిక సమస్య తలెత్తడం తో అత్యవసర ల్యాండింగ్ చేసారు. దీంతో అంత ఊపిరి పీల్చుకున్నారు. అఖండ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బాలకృష్ణ..సంక్రాంతి బరిలో వీరసింహ రెడ్డి మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేయగా , మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ ఎత్తున నిర్మించారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా , థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం తాలూకా టీజర్ , సాంగ్స్, స్టిల్స్ ఇలా ప్రతిదీ సినిమా ఫై అంచనాలు పెంచేయగా..నిన్న శుక్రవారం ఒంగోలు లో ప్రీ రిలీజ్ వేడుక అట్టహాసంగా జరిగింది.
వీర సింహ రెడ్డి ప్రీ రిలీజ్ వేడుక కోసం బాలకృష్ణ నిన్న హైదరాబాద్ నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో ఒంగోలు కు చేరుకున్నారు. రాత్రి ప్రీ రిలీజ్ వేడుక అనంతరం బాలయ్య ఒంగోలు లోనే బస చేసారు. ఈరోజు ఉదయం ఒంగోలు నుండి హైదరాబాద్ కు హీరోయిన్ శృతి హాసన్ , డైరెక్టర్ బి గోపాల్ తో పాటు ఆయన హెలికాప్టర్ లో బయలుదేరారు. బయలుదేరిన కొద్దీ నిమిషాల్లోనే హెలికాప్టర్ లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఇది గమనించిన ఫైలెట్ హెలికాప్టర్ ను వెనక్కి మళ్లించి ఒంగోలులోని హెలిపాడ్ వద్ద అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ప్రస్తుతంసాంకేతిక సమస్యను పరిష్కరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక బాలకృష్ణ విమాన మార్గం ద్వారా హైదరాబాద్ కు రాబోతున్నట్లు సమాచారం. ఈ విషయం తెలిసి అంత ఊపిరి పీల్చుకున్నారు.
ఇక వీరసింహ రెడ్డి విషయానికి వస్తే..క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా, మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించారు. జనవరి 12 న ఈ మూవీ గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది.