దయచేసి తండ్రి మాట వినొద్దు అంటూ చెప్పి వార్తల్లో నిలిచిన బండ్ల గణేష్

బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ అనగానే సంచలనం..కమెడియన్ గా చిత్రసీమలో అడుగుపెట్టి, అతి తక్కువ టైం లోనే స్టార్ ప్రొడ్యూసర్ గా మారారు. పవన్ కళ్యాణ్ , ఎన్టీఆర్ , రామ్ చరణ్, అల్లు అర్జున్ , రవితేజ వంటి అగ్ర హీరోలతో సినిమాలు చేసారు.ఇక పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అయినా గణేష్..స్టేజ్ ఫై పవన్ కళ్యాణ్ ఫై తన అభిమానాన్ని ఎప్పటికప్పుడు వ్యక్తం చేస్తుంటారు.
తాజాగా ఓ ప్రైవేటు ఫంక్షన్‌లో బండ్ల గణేష్, అల్లు బాబీతో కలిసి ఫోటోలు దిగాడు. ఈ సందర్భంగా గణేష్ ‘అందరికి చెబుతున్నా.. దయచేసి తండ్రి మాట వినొద్దు. తండ్రి మాట వింటూ పెరిగితే మా బాబీ గారిలా అవుతారు. తండ్రి మాట వినకుండా నచ్చింది చేస్తే మా హీరో బన్నీగారిలా అవుతారు. బాబీగారిలా కావాలా, బన్నీగారిలా అవ్వాలా అనేది మీరే నిర్ణయించుకోండి. అల్లు బాబీ గారు చిన్నప్పటి నుంచి బాగా చదువుకుని తండ్రి మాట వింటూ పెరిగారు. అందుకే ఇలా ఉన్నారు. కానీ అల్లు అర్జున్ తండ్రి మాట వినకుండా ఇష్టమొచ్చింది చేసుకుంటూ వెళ్లారు. కాబట్టే ఇండియా సూపర్ స్టార్ అయ్యాడు. బట్టి ప్రతి ఒక్కరూ సొంత నిర్ణయాలు తీసుకోవాలి’ అంటూ బండ్ల గణేష్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం గణేష్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.