బండ్ల గణేష్..విజయ్ దేవరకొండ కు కౌంటర్ ఇచ్చాడా..?

బండ్ల గణేష్ మరోసారి విజయ్ దేవరకొండ ను టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది. గతంలో విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా ప్రమోషన్ లలో విజయ్ తీరు ఫై ఆగ్రహం వ్యక్తం చేసిన గణేష్..తాజాగా విజయ్ తన తండ్రితో ఉన్న ఫోటో షేర్ చేయడం పట్ల కౌంటర్ ఇచ్చినట్లు అర్ధం అవుతుంది.
విజయ్ ఆదివారం రోజు సాయంత్రం వేళ తన తండ్రితో కూర్చుని మాట్లాడుతున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ఆ ఫోటోలో విజయ్ దేవరకొండ చిన్న నిక్కరులో తండ్రి ముందు కాళ్లు చాపి కూర్చున్నట్లు అనిపించింది. అయితే ఆ ఫోటోను చూసిన కొందరు నెటిజన్లు చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు అనే విధంగా కామెంట్ చేస్తుండగా..మరికొంతమంది మాత్రం తండ్రి అంటే ఏమాత్రం గౌరవం లేదని మండిపడుతున్నారు.
ఇదే క్రమంలో బండ్ల గణేష్ ఆ ఫోటోను పోస్ట్ చేస్తూ.. తన తండ్రికి సేవలు చేస్తూ ఉన్న మరొక ఫోటోను కూడా పోస్ట్ చేశాడు. అందులో బండ్ల గణేష్ లాక్ డౌన్ సమయంలో తన తండ్రికి తనే స్వయంగా హెయిర్ కటింగ్ చేస్తూ ఉన్నాడు. అంతే కాకుండా ఈ ఫోటోకి ఒక క్యాప్షన్ కూడా ఇచ్చాడు. మనకి ఈ ప్రపంచాన్ని చూసి అదృష్టాన్ని కల్పించిన మన తల్లిదండ్రులు మన దైవాలు వారిని ప్రేమించటం పూజించటం మన ధర్మం.. అంటూ విజయ్ దేవరకొండ ఫోటోకు కౌంటర్ ఇచ్చినట్లుగా పోస్ట్ చేసాడు. ప్రస్తుతం గణేష్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.