బాలయ్య తో శతృత్వం.. మొదటి సారి నోరు విప్పిన బండ్ల గణేశ్

  • Written By: Last Updated:
బాలయ్య తో శతృత్వం.. మొదటి సారి నోరు విప్పిన బండ్ల గణేశ్

నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసంలేదు. ఒకప్పుడు స్టార్ ప్రొడ్యూసర్ గా కొనసాగిన బండ్ల ప్రస్తుతం నిర్మాతగా కొంత గ్యాప్ తీసుకున్నారు. ఇక నిత్యం సోషల్ మీడియాలో అభిమానులతో తన అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటాడు బండ్ల గణేష్. కాగా, తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన మనోగతాన్ని తెలిపాడు. తన కెరీర్ మొదలుకొని ఆయన జీవితంలో ఎదుర్కున్న కష్టాలు, అవమానాలు మొత్తం ఏకరువు పెట్టాడు. ముఖ్యంగా నందమూరి కుటుంబానికి ఆయనకు దూరంగా ఎందుకు ఉంటున్నారు అనేది మొట్ట మొదటిసారి చెప్పుకొచ్చాడు.

మీరు ఎక్కువ మెగా ఫ్యామలీతోనే ఉంటారు.. నందమూరి కుటుంబంతో మీకున్న శతృత్వం ఏంటి అని అడిగిన ప్రశ్నకు బండ్ల మాట్లాడుతూ ” ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి చిరంజీవి గారే దేవుడు.. ఆయన సినిమాలు చూస్తూనే పెరిగాను. మా నాన్న గారు ఎన్టీఆర్ ఫ్యాన్. నాకేమో చిరంజీవి గారి సినిమాలు చూడాలి అని ఉండేది. ఇప్పుడు మీరు అన్నట్లు ఆ కమ్యూనిటీ ఈ కమ్యూనిటీ అంటున్నారు.. కమ్యూనిటీ కూడు పెట్టిద్దా.. అలా అని నేను అనుకోను.. ఇక నందమూరి ఫ్యామిలీ తో దూరంగా ఉంటున్నా అంటున్నారు. అలా ఏం లేదు.. నాకు.. నందమూరి కుటుంబానికి ఎటువంటి శతృత్వం లేదు.. ఎన్టీఆర్ తో నేను రెండు సినిమాలు చేశాను..బాలయ్య బాబు తో శతృత్వం లేదు.. మితృత్వం లేదు. కానీ చిరంజీవి అన్నా ఆయన ఫ్యామిలీ అన్నా బాగా ఇష్టంగా ఉండేవాడిని.అది దూరంగా ఉంటున్నా అని మీరు అంటున్నారు… అసలు దగ్గరగా ఎందుకుండాలి. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి.కానీ నేను మొదటినుంచీ చిరంజీవిగారి కుటుంబంతో ట్రావెల్ అవ్వడం వలన అలా ఐపోయాను.. అంతేకాని బాలయ్య గారిపై కోపం కానీ శతృత్వం కానీ నాకెందుకు.. రాజులందరూ ఒకటి ఐనప్పుడు మంత్రులు, సైనికులు దూరంగా ఎందుకుంటారు.. ఏరోజు ఎవరు కలుస్తారు.. ఏరోజు ఎవరు విడిపోతారు మనమెలా చెప్తాం..” అని చెప్పుకొచ్చాడు.

follow us