బండ్ల‌న్న బ్యాక్..వ‌కీల్ సాబ్ ఈవెంట్ లో ఫ‌న్నీ కామెంట్స్.!

bandla ganesh speech at vakeel saab pre release event
bandla ganesh speech at vakeel saab pre release event

ప‌వ‌న్ క‌ల్యాణ్ పై బండ్ల గ‌ణేష్ ఏ రేంజ్ లో అభిమానాన్ని చాటుకుంటారో తెలిసిందే. ఇక ఆయ‌న త‌న అభిమానం మొత్తం మైక్ దొరికిందంటే మాట‌ల్లో చూపిస్తుంటారు. అంతే కాకుండా ఆయ‌న స్పీచ్ వింటే న‌వ్వులు కూడా వ‌స్తాయి. తాజాగా ప‌వ‌న్ ను పొగుడుతూ వ‌కీల్ సాబ్ ఈవెంట్ లో బండ్ల‌న్న కామెంట్ల‌తో న‌వ్వులు పూయించారు. ఈశ్వ‌రా..ప‌వ‌నేశ్వ‌రా అంటూ స్పీచ్ ను మొద‌లు పెట్టారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ అంటే ఒక వ్య‌స‌నం అని అన్నారు. సినిమా గురించి ఏమీ మాట్లాడ‌న‌ని ఇది చాలా చిన్న విష‌య‌మ‌ని అన్నారు.

ప‌వ‌న్ ర‌క్తాన్ని న‌ట‌న‌గా మార్చి ఆ డబ్బుతో ఫ్యాన్స్ కు ఇన్స్యూరెన్స్ చేయించిన క్యారెక్ట‌ర్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ది అని అన్నారు. శివుడుకి బ‌క్త క‌న్న‌ప్ప‌..శ్రీరాముడికి ఆంజ‌నేయుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ కు బండ్ల గణేశ్ అంటూ డైలాగులు పేల్చాడు. ఇక బండ్ల గ‌ణేశ్ స్పీచ్ లో వింగ్ క‌మాండ‌ర్ అభినంద‌న్ మీసం , ఛ‌త్ర‌ప‌తి శివాజి ప‌ట్టుకున్న క‌త్తి తో పోల్చారు. ఇక బండ్ల స్పీచ్ కు నిర్మాత దిల్ రాజు తో పాటు ఈవెంట్ కు వ‌చ్చిన వారంతా ప‌గ‌ల బ‌డి న‌వ్వారు. ఇక వ‌వ‌న్ క‌ల్యాణ్ సైతం బండ్ల కామెంట్ల‌కు న‌వ్వు ఆపుకోలేక పోయారు.