బండ్ల గణేష్ దత్తత తీసుకున్న అమ్మాయి ఇప్పుడు ఎలా ఉందో చూడండి..

బండ్ల గణేష్ దత్తత తీసుకున్న అమ్మాయి ఇప్పుడు ఎలా ఉందో చూడండి..

బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ అనగానే సంచలనం..కమెడియన్ గా చిత్రసీమలో అడుగుపెట్టి, అతి తక్కువ టైం లోనే స్టార్ ప్రొడ్యూసర్ గా మారారు. పవన్ కళ్యాణ్ , ఎన్టీఆర్ , రామ్ చరణ్, అల్లు అర్జున్ , రవితేజ వంటి అగ్ర హీరోలతో సినిమాలు చేసారు.ఇక పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అయినా గణేష్..స్టేజ్ ఫై పవన్ కళ్యాణ్ ఫై తన అభిమానాన్ని ఎప్పటికప్పుడు వ్యక్తం చేస్తుంటారు.

ఇది పక్కన పెడితే.. బండ్ల గణేష్ ఓ నేపాలీ అమ్మాయిని దత్తత తీసుకున్న సంగతి చాలామందికి తెలిసి ఉండదు. తాను దత్తత తీసుకున్న సంగతి స్వయంగా ఆయనే తెలుపడం జరిగింది. ఈ అమ్మాయి ఎక్కడో నేపాల్‌లో పుట్టింది. నెల రోజుల వయసున్నప్పుడు మా ఇంటికి వచ్చింది. నాకు నా కూతురెంతో ఈ చిన్నారి కూడా అంతే. నాకు విచిత్రమనిపిస్తుంటుంది.. కొంతమంది కుక్క పిల్లలను పెంచుకుంటారు… వాటి కోసం ఎంతో ఖర్చు చేస్తారు. ఈ చిన్నారిని మొదటిసారి చూసినప్పుడు మా ఆవిడ ఆమె వద్దకు వెళ్లి అడిగిందట… చిన్నారికి ఏ ఆహారం పెడుతున్నావని.

ఏం లేవమ్మా… నా పాలే ఇస్తున్నానని చెప్పిందట. అది రాత్రి సమయం… చిన్నారి ఏడుస్తోంది. అప్పుడు మా ఆవిడ నాతో చెప్పింది… ఈ చిన్నారిని నువ్వు తీసుకోమని. ఈరోజు మా ఇంట్లో వాళ్లందరినీ రేయ్ అనే స్థాయికి వచ్చింది. మా కొడుకులను కూడా డిక్టేట్ చేస్తుంది.’ అని నవ్వుతూ బండ్ల గణేష్ ఆ మధ్య చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ అమ్మాయి ఎంతో చలాకీగా ఉంది. ఇంట్లో సరదాగా అటు ఇటు తిరుగుతూ..అల్లారు ముద్దుగా పెరుగుతుంది. ఓ యూట్యూబ్ ఛానల్ వారు స్వయంగా గణేష్ ఇంటికి వెళ్లి ఈ చిన్నారిని ఫ్యాన్స్ కు చూపించే ప్రయత్నం చేసారు.

follow us