మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ పై ఖ‌ర్చీఫ్ వేసిన బెల్లంకొండ‌..!

  • Written By: Last Updated:
మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ పై ఖ‌ర్చీఫ్ వేసిన బెల్లంకొండ‌..!

ప్ర‌స్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ సూప‌ర్ హిట్ సినిమాల రీమేక్ రైట్స్ ను సొంతం చేసుకుంటూ త‌న ఖాతాలో వేసుకుంటున్నారు. ఇప్ప‌టికే ప్ర‌భాస్ హీరోగా న‌టించిన సూప‌ర్ హిట్ సినిమా చ‌త్రప‌తి రీమేక్ రైట్స్ ను సాయి శ్రీనివాస్ సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాతో బెల్లంకొండ బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇస్తున్నారు. ఈ సినిమాకు వివి వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. అంతే కాకుండా ఈ సినిమాలో హీరోయిన్ గా శ్ర‌ద్ధాక‌పూర్ న‌టించ‌బోతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇదిలా ఉండ‌గా తాజాగా సాయి శ్రీనివాస్ మ‌రో సూప‌ర్ హిట్ సినిమా రీమేక్ రైట్స్ ను సొంతం చేసుకున్న‌ట్టు స‌మాచారం. త‌మిళంలో సూప‌ర్ హిట్ గా నిలిచిన క‌ర్న‌న్ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ ను బెల్లంకొండ సొంతం చేసుకున్నార‌ట‌. ఎప్రిల్ 2న విడుద‌లైన ఈ సినిమా సూప‌ర్ హిట్ గా నిలిచింది. త‌ర‌వాత అయితే సినిమాకు పోటీ పెరుగుతుందేమో అని భావించిన శ్రీనివాస్ ముందుగానే సినిమాను సొంతం చేసుకున్నారు.

follow us