నేడు భారత్ బంద్

జాతీయ ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా సమ్మెకు దిగుతున్నారు . సమ్మెలో బ్యాంక్ యూనియన్లు ఉండటంతో .. ప్రభుత్వ రంగ బ్యాంక్ సేవలు నిలిచిపోనున్నాయి. కార్మిక సంఘాలు ఈనెల 3నుంచే నిరసన కార్యక్రమాలు చేపట్టాయి .
కార్మిక హక్కులే ధ్యేయంగా జాతీయట్రేడ్ యూనియన్ పిలుపుతో సమ్మె జరుగుతుంది . అంగన్వాడీలు, బీఎస్ఎన్ఎల్లు ఉద్యోగులు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, హెచ్‌పీసీఎల్, సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ సంఘాలకు చెందిన కార్మికులు విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొంటున్నారు.
ప్రభుత్వ రంగ సంస్థల్లో వేతన సవరణలు.. ప్రైవేటీకరణ దిశగా బీఎస్ఎన్ఎల్ , డిమాండ్లతో సంఘాలు సమ్మెకుదిగాయి. కేంద్రం 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్స్‌గా మారుస్తుండటంతో సుమారు 6 లక్షల మంది ఉద్యోగులు, కార్మికులు హక్కులు కోల్పోయే ప్రమాదం ఉందంటున్నాయి కార్మిక సంఘాలు.
ధరల నియంత్రణ, నిరుద్యోగ యువతకు అవకాశాలు, కార్మికులకు ఉద్యోగ భద్రత, ట్రేడ్ యూనియన్ల హక్కులను హరించొద్దని .. కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.