బిబి 4: వరస్ట్ పెర్ఫామర్‌గా జైల్ కు అభిజిత్

ఇంకో రెండు వారాల్లో బిగ్ బాస్ 4 కంప్లీట్ అవ్వుతుంది. ప్రస్తుతం 13 వ వారంలోకి వచ్చేసింది. గడిచిన రెండు రోజులనుండి కంటెస్టెంట్స్ మధ్య సంతోషకరమైన వాతావరణం నెలకొంది. మొదటి ఎపిసోడ్ నుండి మైండ్ గేమ్ ఆడుతూ ప్రేక్షకుల మనసు గెలుచుకున్న అభిజిత్ బిగ్ బాస్ 4 వరస్ట్ ఫర్ఫార్ మెన్స్ ఆఫ్ ది ఇయర్ అయ్యాడు.. బిగ్ బాస్ ఇప్పటివరకు హౌస్ మెంట్స్ పర్ఫామెన్స్‌ని పరిగణలోకి తీసుకుని ఈ ఇంట్లో మీరు ఏ ర్యాంక్ కు సరిపోతారో ఆ ర్యాంక్ ను ఎంచుకోవాలని అదేవిదంగా ఎందుకు మీరు ఆ ర్యాంక్ కు అర్హులో వివరించమన్నాడు.
హౌస్ మెంట్స్ మొత్తం తమ తమ ర్యాంక్ లను ఎంచుకుని వారి వారి ప్లేస్ లోనిలబడ్డారు. నెంబర్ వన్ స్థానంలో అఖిల్ ఉండగా అభిజిత్ మాత్రం నెంబర్ సిక్స్ ను ఎంచుకుని అక్కడ నిలబడ్డాడు. అభిజిత్ ఈ విషయంపై బిగ్ బాస్ కు వివరిస్తూ నేను మొదటి నుండి మంచి గేమ్ ఆడుతూనే వచ్చాను. నేను గడిచిన వారంలో బిగ్ బాస్ ను హార్ట్ చేశాను… అది ఒక్కటే నేను చేసిన మిస్టేక్.. అంతే తప్పు… లేకపోతే ఫస్ట్ ర్యాంక్ కోసం పోరాడే వాడిని అన్నాడు..
అందుకే సీజన్ 4 మొత్తం వరస్ట్ పెర్ఫామర్‌గా ఒప్పుకోవడానికి నేను రెడీ గా ఉన్నాను… దయచేసి నా రిక్వెస్ట్ ని ఆక్సెప్ట్ చెయ్యండి బిగ్ బాస్ అన్నారు… 6 వ ప్లేస్ లో ఉన్న అభిజిత్ వరస్ట్ పెర్ఫామర్‌గా ఎంపిక కావడంతో వెంటనే జైల్ కి తరలించండి అని ఆర్డర్ వేశాడు. అభిజిత్ జైల్ కు వెళ్లడంతో ఆయన అభిమానులు ఆలోచనలో పడ్డారు.. ఈ సీజన్ టైటిల్ విన్నర్ అవ్వుతాడనుకుంటే.. వరస్ట్ పెర్ఫామర్‌గా ప్రకటించుకున్నాడు.. అభిజిత్ జైల్ కు వెళ్ళడం వెనుక అతని మాస్టర్ ప్లాన్ ఉందని అనిపిస్తుంది. ప్రేక్షకులో సింపతీ పెరిగి ఓట్లు పడుతాయని అభిజిత్ భావించి ఉండొచ్చు..