బిగ్ బాస్-5 కి అంతా సిద్ధం..కానీ అనుకోని షాక్..!

  • Written By: Last Updated:
బిగ్ బాస్-5 కి అంతా సిద్ధం..కానీ అనుకోని షాక్..!

అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ షో ఫస్ట్ సీజన్ నుండి మంచి రేటింగ్ తో దూసుకుపోతుంది. ఇక ఇప్పటి వరకు బిగ్ బాస్ తెలుగు నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది. నాలుగో సీజన్ తో బిగ్ బాస్ కు మరింతమంది ప్రేక్షకులు దగ్గరయ్యారు. అంతే కాకుండా అత్యధిక టీఆర్పే రేటింగ్ వచ్చిన షో అంటూ నాగార్జున పదే పదే చెప్పారు. ఇక బిగ్ బాస్ సీజన్ 4 కోసం కంటెస్టెంట్ లను క్వారన్టైన్ లో ఉంచి మరీ హౌస్ లోకి పంపించారు.

ఇక బిగ్ బాస్ 5 ను కూడా జూన్ లో ప్రారంభించాని నిర్వాహకులు అనుకున్నారు. ఇప్పటికే హౌస్ లోకి పంపేందుకు కావాల్సిన సెలబ్రెటీల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తయ్యిందట. అయితే ఈ సారి కూడా బుల్లితెర సెలబ్రెటీలు, సోషల్ మీడియా సెలబ్రెటీలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. కానీ కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఎక్కువగా ఉండటం తో వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. దాంతో సెప్టెంబర్ లో ప్రారంబించి డిసెంబర్ వరకు పూర్తి చేయాలని అనుకుంటున్నారట. ఇక ఈ సీజన్ కు కూడా హోస్ట్ గా నాగార్జున నే వ్యవహరించబోతునట్టు తెలుస్తోంది.

follow us