బాల‌య్య “అఖండ‌”కు ఓటీటీ నుండి బంప‌రాఫ‌ర్..!

  • Written By: Last Updated:
బాల‌య్య “అఖండ‌”కు ఓటీటీ నుండి బంప‌రాఫ‌ర్..!

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం చేస్తున్న సినిమా అఖండ. ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహా లెజెండ్ సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో అఖండతో హ్యాట్రిక్ పక్కా అని బాలయ్య ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇక ఇప్పటికే సినిమా షూటింగ్ కూడా ముగింపు దశకు చేరుకుంది. అంతే కాకుండా ఈ సినిమాను వచ్చే నెల విడుదల చేయాలని అనుకున్నారు. అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో విడుదల వాయిదా పడే అవకాశం ఉంది.

కరోనా విజృంభన నేపథ్యంలో మళ్లీ మాములు పరిస్థితులు ఎప్పుడు వస్తాయో కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. దాంతో అఖండకు ఓ ఓటీటీ నుండి భారీ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా రూ.65 కోట్ల ఆఫర్ ఇచ్చినట్టు టాక్ వినిపిస్తోంది. ఇక ప్రస్తుతం బాలయ్య సినిమాలు పాతిక కోట్ల కంటే ఎక్కువ వసూలు చేయడం లేదు. దాంతో చిత్రయూనిట్ కూడా ఈ డీల్ కు ఒకే చెబుతోందనే ఫిల్మ్ నగర్ టాక్.

follow us