లేడీ సూపర్ స్టార్ కు బిగ్ షాక్

లేడీ సూపర్ స్టార్ కు బిగ్ షాక్

లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచుకునేం నయనతారకు తమిళ్ థియేటర్స్ యాజమాన్యం బిగ్ షాక్ ఇచ్చారు. గ్లామర్ పాత్రలతో పాటు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న నయన్..రీసెంట్ గా ‘కనెక్ట్’ అనే హారర్ థ్రిల్లర్ మూవీ చేసింది. ఈ మూవీ కి అశ్విన్ శరవణన్ డైరెక్ట్ చేయగా , నయన్ భర్త విగ్నేష్ నిర్మాత గా వ్యవహరించారు. ఈ నెల 22 న తెలుగు, తమిళ్ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయాలనీ అనుకున్నారు. తీరా ఈ సినిమా రిలీజ్ టైం లో తమిళ్ థియేటర్స్ యాజమాన్యం షాక్ ఇచ్చారు. ఈ సినిమాను ప్రదర్శించలేమని తేల్చి చెప్పారు. దీనికి కారణం చిత్ర నిడివి తక్కువగా ఉండడం, ఇంటర్వెల్ లేకుండా సినిమా మొత్తం అలాగే రన్ అవ్వడమే.

హాలీవుడ్ సినిమాలు 3 గంటలకు నిడివికి పైనే వుంటున్న ఈ రోజుల్లో నయన సినిమా కేవలం గంటా 30 నిమిషాలే వుండటం గమనార్హం. ఇదే ఇప్పుడు తమిళనాట ఈ మూవీకి పెద్ద ఇబ్బందికరంగా మారింది. ప్రతీ సినిమాకు ఇంటర్వెల్ వుంటేనే థియేటర్ సిబ్బందికి ఎంతో కొంత ఆదాయం వుంటుంది. ఇంటర్వెల్ సమయంలో అమ్మే కూల్ డ్రింక్స్ చిరు తిళ్లకు ఈ సినిమా గండి కొట్టేలా వుందని పలువురు థియేర్స్ ఓనర్స్ చిత్ర బృందానికి తెలిపినట్టుగా చెబుతున్నారు. ఈ విషయంలో పునరాలోచించుకుని ఇంటర్వెల్ వుండేలా ప్లాన్ చేయాలని మేకర్స్ తో చర్చిస్తున్నారట. ఇక తెలుగులో మాత్రం ఈ మూవీ కి ఎలాంటి అడ్డంకులు తెలుపలేదు.

follow us