సోహెల్ : మెగాస్టార్ నాకోసం రెండు గంటలు.

bigg boss 4 sohel visits chiranjeevis house

బిగ్ బాస్ తెలుగు సీజన్-4 టాప్ 3 కాంటెస్టెంట్స్ లో ఒకరు సోహెల్. కరీంనగర్ జిల్లాకు చెందిన ఈ సింగరేణి బిడ్డ బిగ్ బాస్ హౌస్ లో సందడి చేసి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. కుల్లం కుల్లా గా మాట్లాడే సోహెల్ మాటలకు అంతా ఫిదా అయ్యారు. ఇక ఫైనల్స్ లో సోహెల్ తనకు వచ్చిన డబ్బుతో కొంత అనాధాశ్రమనికి ఇస్తానని మెగాస్టార్ మనసును కూడా దోచుకున్నారు. దాంతో చిరు ఆ డబ్బు నేను ఇస్తానంటూ ముందుకు వచ్చారు. అంతే కాకుండా సోహెల్ కు బిర్యానీ అంటే ఇష్టమని..చిరు భార్య సురేఖ సవ్యంగా వండి మరీ బిర్యానీ పంపించారు. ఇదంతా మనకు తెలిసిందే.

ఇక తాజాగా సోహెల్ శుక్రవారం మెగాస్టార్ ఇంటికి వెళ్లారు. చిరు ఫ్యామిలీ మెంబెర్స్ తో సరదాగా గడిపారు. మెగాస్టార్ తల్లి అంజనాదేవితో కలిసి ఫోటో కూడా దిగారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా సోహెల్ చిరు ఇంటికి వెళ్లిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. వీడియోలో సోహెల్ మాట్లాడుతూ… మెగాస్టార్ తనకోసం రెండు గంటలు సమయం కేటాయించారని అన్నాడు. మెగా ఫ్యామిలితో కాసేపు సరదాగా గడిపినట్టు సోహెల్ వెల్లడించారు. మెగా కుటుంబం పై తన ప్రేమను చెప్పడానికి కృతజ్ఞత అనే పదం చాలదని అది చాలా చిన్నపదమని చెబుతూ ఎమోషనల్ అయ్యాడు.