హిందీ బిగ్ బాస్ ఎంత పెద్ద హిట్ రియాలిటీ షో గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా నిన్నటి ఆదివారం వరకు 14 సీజన్లు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. ఇక 14వ సీజన్ కు రూబినా దిలేక్ అనే టీవీ నటి విన్నర్ గా నిలిచింది. రూబినా తన భర్త అభినవ్ తో పాటు కలిసి హౌస్ లోకి అడుగుపెట్టింది. గ్రాండ్ ఫైనాలే కు కొన్ని ఎపిసోడ్స్ ముందే అభినవ్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు. భర్త ఎలిమినేట్ అయ్యాక కూడా రూబినా మాత్రం తన తెలివి తేటలతో హౌస్ లో విన్నర్ అయ్యేవరకు పోరాడింది.
కాగా రన్నరప్ గా రాహుల్ వైద్య నిలిచారు. టాప్ 5 లో రూబినా, రాహుల్, ఎలి గోని, నిక్కీ తంబాలి, రాఖీ సావంత్ ఉండగా..రాఖీ సావంత్ రూ. 14 లక్షలు తీసుకుని షో నుండి వెళ్లిపోయింది. దాంతో విన్నర్ గా నిలిచిన రుబినా దిలేక్ కు సల్మాన్ ఖాన్ రు.36 లక్షల ప్రైజ్ మనీని అందజేశారు. రుబినా హిందీలో పలు సీరియల్స్ లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యింది. సోషల్ మీడియాలో కూడా రుబినాకు ఫ్యాన్స్ కు ఎక్కువే. దాంతో ఆమె హౌస్ లో ఉన్నా కూడా భయట సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఫ్యాన్స్ అండతో మొత్తానికి రుబినా సీజన్ 14 టైటిల్ ను కైవసం చేసుకుంది.