అలియా భ‌ట్ కు క‌రోనా..టెన్ష‌న్ లో ఆర్ఆరఆర్ టీం..!

  • Written By: Last Updated:
అలియా భ‌ట్ కు క‌రోనా..టెన్ష‌న్ లో ఆర్ఆరఆర్ టీం..!

క‌రోనా మ‌హ‌మ్మారి మ‌ళ్లీ విజృంభిస్తుంది. రోజు రోజుకు కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఇక ఇప్పుడిప్పుడే గాడిన ప‌డుతున్న సినీ ప‌రిశ్ర‌మ‌కు సైతం మ‌ళ్లీ క‌రోనా టెన్ష‌న్ ప‌ట్టుకుంది. ఇప్ప‌టికే ప‌లువురు న‌టీన‌టులు క‌రోనా భారీన ప‌డి హోం ఐసోలేష‌న్ లో చికిత్స తీసుకుంటున్నారు. కాగా తాజాగా ఆర్ఆర్ఆర్ బ్యూటీ అలియా భ‌ట్ కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. ఈ విష‌యాన్ని అలియా త‌న ఇన్‌స్టాగ్రామ్ లో పేర్కొంది. త‌న‌కు క‌రోనా పాజిటివ్ వచ్చిందని తెలిపింది. ప్ర‌స్తుతం డాక్ట‌ర్ల సూచ‌న‌ల మేర‌కు మందులు తీసుకుంటున్నాన‌ని పేర్కొంది. త‌న‌కు మ‌ద్ద‌తు తెలుపుతున్న‌వారంద‌రికీ కృత‌జ్జ‌త‌లు తెలిపింది. అంద‌రూ సుర‌క్షితం గా ఉండాల‌ని సూచించింది.

ఇదిలా ఉండ‌గా అలియా భ‌ట్ ప్ర‌స్తుతం గంగూబాయి క‌తియావాడి సినిమాలో న‌టిస్తోంది. ఇటీవ‌లే ఈ సినిమా ద‌ర్శ‌కుడు భ‌న్సాలీ క‌రోనా బారిన ప‌డ్డారు. అంతే కాకుండా అలియా భ‌ట్ బాయ్ ఫ్రెండ్ ర‌న్బీర్ క‌పూర్ సైతం క‌రోనా బారిన ప‌డ్డారు. దాంతో కొద్ది రోజుల క్రితం క‌రోనా టెస్ట్ చేసుకోగా అలియాకు నెగిటివ్ వ‌చ్చింది. కానీ తాజాగా మ‌రోసారి కరోనా టెస్ట్ చేసుకోగా అలియాకు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. ఇక అలియా క‌రోనా బారిన ప‌డ‌టం తో ఆర్ఆర్ఆర్ టీం కు సైతం కోరోనా టెన్ష‌న్ ప‌ట్టుకుంది. అలియా భ‌ట్ ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చ‌ర‌ణ్ కు జోడీగా సీత పాత్ర‌లో న‌టిస్తోంది.

follow us

Web Stories