బోయపాటి-బన్నీ కాంబోలో మరో సినిమా ..!

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ప్రస్తుతం బాలయ్య హీరోగా అఖండ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ టికార్డులు క్రియేట్ చేస్తోంది. యంగ్ హీరోల టీజర్లను సైతం బీట్ చేస్తూ అఖండ దూసుకెలుతోంది. దాంతో సినిమాపై కూడా ఎన్నో అంచనాలున్నాయి. ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం బోయపాటి అల్లు అర్జున్ కాంబోలో మరో సినిమా రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే బోయపాటి అల్లు అర్జున్ కు సరైనోడు సినిమాతో మంచి హిట్ ఇచ్చారు. అయితే ఇప్పటికే బోయపాటి గీత ఆర్ట్స్ బ్యానర్ నుండి అడ్వాన్స్ కూడా తీసుకున్నారట.
దాంతో అల్లు అర్జున్ తో మరో సినిమా చేసే అవకాశం ఉందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా గడిచిన రెండు మూడు వారాల్లో అల్లు అర్జున్ ను కలిసి బోయపాటి ప్రాజెక్ట్ గురించి చర్చించారట. ప్రస్తుతం స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్నారట. ఇక స్క్రిప్ట్ రెడీ అవ్వగానే బోయపాటి బన్నీకి వినిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా పుష్ప తరవాత ఎన్టీఆర్ ఎవరితో సినిమా చేస్తారన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. అసలైతే కొరటాలతో సినిమా చేయాలి కానీ కొరటాల ఎన్టీఆర్ తో సినిమాను ఫిక్స్ చేసుకున్నారు. అంతే వేణు శ్రీరామ్ తో కూడా సినిమా ఉంటుందని టాక్ వినిపించింది కానీ ఈ సినిమా కూడా ఫైనల్ కాలేదు.