రెమ్యూనరేషన్ డిమాండ్ ఫై బుట్టబొమ్మ కామెంట్స్

రెమ్యూనరేషన్ డిమాండ్ ఫై బుట్టబొమ్మ కామెంట్స్

బుట్టబొమ్మ వరుస ప్లాపులు పడుతున్నప్పటికే తన రెమ్యూనరేషన్ విషయంలో ఎక్కడ తగ్గడం లేదని , భారీగా డిమాండ్ చేస్తుందనే కామెంట్స్ ఫై స్పందించింది. కెరియర్ మొదట్లో వరుస ప్లాప్స్ అందుకొని ఐరెన్ లెగ్ అనిపించుకున్న పూజా హగ్దే..ఆ తర్వాత డీజే మూవీ తో సూపర్ హిట్ అందుకొని వెనుకకు చూసుకోవాల్సిన పనిలేదు అనే రీతిలో స్టార్ హీరోయిన్ అయ్యింది. తెలుగు ,తమిళ్ , హిందీ వంటి భాషల్లో వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తుంది. కాకాపైతే ఈ ఏడాది అమ్మడికి వరుస ప్లాప్స్ షాక్ ఇచ్చాయి.

‘రాధేశ్యామ్’..’బీస్ట్’..’ఆచార్య’ అన్నీ డిజాస్టర్ ఖాతాలోనే పడ్డాయి. ప్రస్తుతం సక్సెస్ కోసం ఎదురు చూస్తుంది. చేతిలో అవకాశాలైతే బాగానే ఉన్నాయి. కాగా కొత్త చిత్రాలకు పారితోషికం భారీగానే డిమాండ్ చేస్తుందని ప్రచారం సాగుతోంది. వీటిపై పూజాహెగ్డే స్పందించింది. పారితోషికం కోసం నిర్మాతల్ని ఇబ్బంది పెట్టడం.. రెమ్యునరేషన్ పెంచడం వంటివి చేయలేదని క్లారిటీ ఇచ్చింది. అవన్నీ మీడియాలో వస్తోన్న కట్టు కథనాలు. పారితోషికం కోసమే పనిచేయాలంటే? ఇప్పటికే చాలా సినిమాలకు అడ్వాన్సులు అందుకుని బిజీగా ఉండేదాన్ని. కానీ నేనంత బిజీగా లేను. మంచి కథల కోసం చూస్తున్నాను. అలాంటి కథలు నాముందుకొస్తే డబ్బు విషయమే కాదు. నిర్మాత ఇచ్చిన ఆఫర్ కే పనిచేస్తాను. ఒక సినిమాకు సంతకం చేసిన తర్వాత బాండ్ అయి పనిచేస్తాను. అది నా స్వభావం. నిర్మాతలొచ్చి అడ్వాన్స్ లు ఇస్తున్నారని తీసుకుని అకౌంట్ లో వేసుకోను తేల్చి చెప్పింది.

follow us