డిస్ట్రిబ్యూటర్ల ఒత్తిడి తో తగ్గనున్న మహేష్ , అల్లు అర్జున్

డిస్ట్రిబ్యూటర్ల ఒత్తిడి తో తగ్గనున్న మహేష్ , అల్లు అర్జున్

సంక్రాంతి హాలిడేస్ సందడి చేయడానికి టాలీవుడ్ నుండి బడా హీరోలు రెడీ అయ్యారు , ఈ  సంక్రాంతికి మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు , అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపుర్రంలో సినిమాలు వస్తున్నాయి. వీళ్ళ మధ్య పోటీ ఎలా ఉంది అంటే ప్రతి సాంగ్ , అప్డేట్ , పోస్టర్ కి నువ్వా నేనా అన్నట్లు ఉంది .

అయితే రిలీజ్ డేట్ విషయంలో ఎవరికి ఎవరు తగ్గడం లేదు , మొదట కాంప్రమైజ్ సరిలేరు నీకెవ్వరు జనవరి 11న , అల వైకుంఠపుర్రంలో జనవరి 12న డేట్స్ ఫిక్స్ చేసుకున్నారు . ఏమైందో ఏమో కానీ అల్లు అర్జున జనవరి 10న రావాలని వత్తిడి తెచ్చినట్లు వినికిడి , అలాగే మహేష్ తగ్గకుండా కూడా 10న వస్తాడని వార్తలు వచ్చాయి . ఆ నేపథ్యంలో రెండు సినిమాలు యూ/ఏ సర్టిఫికెట్ తో సెన్సార్ పూర్తి చేసుకున్నాయి . ఇది ఇలా ఉంటే డిస్ట్రిబ్యూటర్లు ఈ డేట్స్ విషయం లో తికమక తో వత్తిడి తెచ్చారట , దేనితో వెనకకి తగ్గటానికి సిద్ధమయ్యారు మన హీరోలు .

follow us

Web Stories