యూట్యూబ్ లో చూసి బీర్ తయారు చేసిన ప్రబుద్ధుడు : ఎలా చేసాడో తెలుసా..?

కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా మందు దొరకక మందు బాబులు తిప్పలు పడుతున్నారు.. అయితే దీనినే అదునుగా తీసుకొని ఒక ప్రబుద్దుడు బీర్ తయారుచేయడం మొదలు పెట్టాడు, తయారు చేసి తాను తాగడమే కాకుండా వాటిని విక్రయిస్తూ పోలీసులకు దొరికి పోయాడు.. 

తమిళనాడులో తిరుచ్చినాం కుప్పం ప్రాంతంలో క్యారెట్‌ బీర్‌ తయారు చేస్తున్నట్టు వచ్చిన సమాచారం తో పోలీసులు వెళ్లి సోదాలు చేసి సదరు వ్యక్తిని పట్టుకున్నారు.. 

పోలీసులు బీర్ ఎలా తయారు చేసావ్ అని అడగగా యూట్యూబ్ లో చూసి చేశా అని.. క్యారెట్‌  లో కొన్ని రసాయనాలు కలిపితే మత్తు ఎక్కుతుందని చూసి తయారు చేశా.. బాగా రావడం తో అమ్ముతున్న అని చెప్పాడు.. 
లాక్ డౌన్ పుణ్యమా అని దాగి ఉన్న టాలెంట్ ను బయటకు తీస్తున్నారు మహానుభావులు..