ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి , చంద్రబాబునాయుడు హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావును ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే . ఏబీ వెంకటేశ్వరరావు మీద విధినిర్వహణలో అధికార దుర్వినియోగానికి పాల్పడినందుకు వచ్చిన ఆరోపణలను క్షుణ్ణంగా పరిశీలించిన మీద ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రభుత్వం జారీ చేసిన జీవోలో స్పష్టం చేసింది.
అయితే ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్ లో పిటిషన్ వేశారు. క్యాట్ లో పిటిషన్ కొట్టివేస్తూ విధించిన సస్పెన్షన్ ను సమర్థించి పిటిషన్ కొట్టి వేసింది ట్రిబ్యునల్ .