రవితేజ కోసం ఆమెను తగ్గించారా..?

మాస్ మహారాజా రవితేజ 2022 ఏడాది చివర్లో ధమాకా తో బ్లాక్ బస్టర్ కొట్టి అభిమానులకు సంతోషం నింపారు. హిట్ , ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న రవితేజ..అభిమానులు కోరుకునే హిట్ మాత్రం ఇవ్వలేకపొతున్నాడు. గత ఈఏడాది ఖిలాడీ , రామారావు ఆన్ డ్యూటీ , ధమాకా చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వీటిలో ఖిలాడీ , రామారావు ఆన్ డ్యూటీ మూవీస్ భారీ ప్లాప్స్ అందుకున్నాయి. దీంతో అభిమానులు ధమాకా మూవీ పైనే ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా కూడా మొదట్లో హిట్ అవుతుందో లేదో అని ఖంగారుపడ్డారు కానీ..మూవీ లోని జింతాక్..జింతాక్ సాంగ్ ఒక్కసారిగా అంచనాలు రెట్టింపు చేసింది. ఆ తర్వాత వచ్చిన ట్రయిలర్ కూడా ఆశలు రెట్టింపు చేసింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ మూవీ అభిమానులను విపరీతంగా అలరించడమే కాదు బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామి సృష్టిస్తుంది.
ఇక ఇప్పుడు మరో 11 రోజుల్లో వాల్తేర్ వీరయ్య తో రవితేజ వస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి – బాబీ కలయికలో తెరకెక్కిన ఈ మాస్ ఎంటర్టైనర్ లో రవితేజ ఓ కీలక పాత్ర పోషించాడు. ఇప్పటీకే రవితేజ తాలూకా లుక్ , ట్రైలర్ , సాంగ్ వచ్చి అభిమానులు అంచనాలు పెంచేసింది. ఎప్పుడెప్పుడా ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని మెగా , మాస్ రాజా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక ఈ మూవీ లో రవితేజ కు జోడీగా కేథరిన్ థ్రెస్సాను తీసుకున్నారని ఆ మధ్యనే ఓ న్యూస్ లీకైంది. అంతేకాదు, ఆమె పలు షెడ్యూళ్లలో పాల్గొందని కూడా అన్నారు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో కేథరిన్ పాత్రకు సంబంధించిన సన్నివేశాలను కట్ చేశారని తెలుస్తుంది. రవితేజ పాత్రను ఎలివేట్ చేయడం కోసమే ఆమెతో ఉన్న సన్నివేశాలను తీసేశారని అంటున్నారు. అయితే, ఈ హీరోయిన్‌ను కొన్ని సీన్స్‌కే పరిమితం చేశారా? లేక మొత్తానికి తీసేశారా? అన్నది తెలియాల్సి ఉంది. ఇక చిరు కు జోడిగా శృతి హాసన్ నటించగా..ఈ మూవీ కి దేవి మ్యూజిక్ ఇచ్చాడు. మరి ఈ మూవీ సంక్రాంతి బరిలో ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి.