తమిళనాట ఓటేసిన సెలెబ్రెటీలు..సైకిలెక్కిన హీరో.!

  • Written By: Last Updated:
తమిళనాట ఓటేసిన సెలెబ్రెటీలు..సైకిలెక్కిన హీరో.!

నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం పరిధిలోని అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సినీ రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. తమిళ నాట స్టార్ హీరోలు తమ ఓటు హక్కుని వినియోగించుకునేందుకు క్యూ కట్టారు. తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ థౌజండ్ లైట్స్ నియోజకవవర్గం లోని స్టెల్లా కలేజీ పోలింగ్ బూత్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎంఎన్ఎం అధినేత కమల్ హాసన్ తన కుమార్తెలు శృతి హాసన్, అక్షర హసన్ తో కలిసి తేనేంపేటలోని చెన్నై స్కూల్ పోలింగ్ కేంద్రంలో ఓటుహక్కును వినియోగించుకున్నారు.

తమిళనాడు ఎన్నికల్లో హీరో విజయ్ తన ఓటు హక్కును నీలాంగిరి పోలీంగ్ బూత్ పరిధిలో వినియోగించుకున్నాడు..సైకిల్ పై పోలింగ్ బూత్ కి వెళ్లి విజయ్ ఓటు వేసారు.ఇక హీరో అజిత్ తన భార్య తో కలిసి పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. ఆ సమయంలో ఓ అభిమాని ఫోటో తీస్తుండగా అజిత్ ఆగ్రహానికి గురయ్యారు. అభిమాని ఫోన్ లాక్కుని జేబులో పెట్టుకున్నారు. మళ్ళీ ఫోటో తీయవద్దని ఫోన్ ఇచ్చేసారు. అంతే కాకుండా సూర్య, ఉదయనిది స్టాలిన్ , కార్తీ, మరికొంతమంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

follow us