శివ‌రాత్రి ప‌ర్వ‌దినాన జ‌గ్గీవ‌సుదేవ్ ఆశ్ర‌మంలో తార‌ల సంద‌డి.!

celebrities spotted at Coimbatore Jaggi vasudev ashram
celebrities spotted at Coimbatore Jaggi vasudev ashram

శివరాత్రి సంధర్బంగా పలు ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఉత్సవాలు జరిగాయి. దేశంలోని ప్రముఖ ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరగ్గా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఇక కోయంబత్తూరు లోని సద్గురు ఇషా యోగా కేంద్రం లోకూడా శివరాత్రి సంధర్బంగా ప్రత్యేక ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కు సాధారణ ప్రజలతో పాటు టాలీవుడ్ సెలబ్రెటీలు సైతం హాజరయ్యారు. హాజరైన సెలబ్రెటీల్లో ఫిట్ నెస్ ఫ్రీక్ లు సమంత, రఖుల్ ప్రీత్ సింగ్, మంచు లక్ష్మి , శిల్పా రెడ్డి ఉన్నారు.

సమంత శిల్పా రెడ్డి క్లోజ్ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. ఎన్నో సార్లు వీరిద్దరూ కలిసి టూర్ లకు వెళ్లారు. ఇక రకుల్ ప్రీత్ మరియు మంచి లక్ష్మీ కూడా అలాంటి స్నేహితులే. దాంతో నలుగురు కలిసి శివరాత్రికి కోయంబత్తూరు వెళ్లినట్టు తెలుతెస్తోంది. శివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రశాంతంగా గడపడానికి ఇషా యోగ కేంద్రానికి వెళ్లారు. ఈ సంధర్బంగా వాళ్ళు దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.