షారుఖ్ మూవీ కి షాక్ ఇచ్చిన సెన్సార్

షారుఖ్ మూవీ కి షాక్ ఇచ్చిన సెన్సార్

షారుఖ్ లేటెస్ట్ మూవీ పఠాన్ కు సెన్సార్ యూనిట్ షాక్ ఇచ్చింది. షారుఖ్ – దీపికా జంటగా సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ.. జనవరి 25, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ప్రముఖ హిందీ నిర్మాణ సంస్థ యష్ ఫిలిమ్స్ బ్యానర్ లో వస్తున్న ఈ చిత్రంలో హీరో జాన్ అబ్రహం కీలక పాత్ర పోషిస్తున్నాడు. అలాగే సల్మాన్ ఖాన్ కూడా అతిధి పాత్రలో కనిపించబోతున్నాడు. గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న షారుక్..ఈ మూవీ ఫై భారీ ఆశలే పెట్టుకున్నాడు.

ఈ క్రమంలో ఈ సినిమాలోని బేషరమ్ రంగ్ పాటను విడుదల చేసారు. యూత్ ఈ సాంగ్ కు ఫిదా అయితే..కొంతమంది రాజకీయ నేతలు , సినీ విశ్లేషకులు మాత్రం విమర్శలు చేశారు. సాంగ్ లో దీపికా కాషాయ రంగు బికినీ ధరించడంపై మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి నరోత్తమ్ మిశ్రాతోపాటు పలు సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అలాగే సినిమాను విడుదల చేయడం ఆపాలని డిమాండ్ కూడా చేశారు. ఇప్పుడు సెన్సార్ కూడా అదే అభ్యంతరం తెలిపింది.

బేషరమ్ రంగ్ సాంగ్ లో కొన్ని సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని, అలానే చిత్రంలో కూడా పలు సీన్లను తీసివేయాలని సెన్సార్ బోర్డ్ ఆదేశించింది. పలు సన్నివేశాలను కత్తిరించాలని లేదా మార్పులు చేయాలని సూచించింది. దీంతో మేకర్స్ సెన్సార్ చెప్పినట్లు కత్తెరింపులు చేస్తున్నట్లు వినికిడి.

follow us

Related News