సెంట్రల్ గవర్నమెంట్ కి బాగా దగ్గర అయినా శ్రీపీఠం పీఠాధిపతి, ఆధ్యాత్మికవేత్త స్వామి పరిపూర్ణానంద చెప్పిన విషయం ఇది.. ఇంకా దేవాలయాలు అన్ని సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తాయి అంట.. దీని కోసం ఒక ప్రత్యేక మైన బిల్లును తొందర లో అసెంబ్లీ లో కూడా ప్రెవేశపెడతారు అని.. కేంద్ర ప్రభుత్వం దేవాలయాలను ఆధ్యాత్మిక కేంద్రాలుగా తీర్చిదిద్దడానికి చర్యలు చేపట్ట పోతుంది. తమిళనాడులోని చిదంబరం ఆలయం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది అని కూడా స్వామిజీ చెప్పారు.. వీటి గురించి ఎక్కడ వార్తలలో రాలేదు కూడా..
ఆంధ్ర లో గుడులు అన్ని దేవదాయ ధర్మదాయ మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉంటాయి.. ఇంకా తిరుమల అయితే వాటికీ ప్రత్యేకమైన బోర్డు, ప్రత్యేకమైన చట్టాలు కూడా.. తిరుమల ని ఒక ఐకానిక్ సిటీ అంటే ఒక వాటికన్ సిటీ ల కూడా మారుస్తాం అంటూ మన నాయకులూ చెప్తూ ఉంటారు.. రాష్ట్రం విడిపోయాక యాదాద్రి ని తిరుమల తో సమానంగా కెసిఆర్ అభివృద్ధి చేస్తున్నారు.. జనాల్లోకి తీసుకుపోవడానికి ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ చాలానే ఖర్చుబెతున్నారు..
దేవుడు భక్తి ఎక్కువ ఉన్న వాళ్ళు చూపించే విపరీతం మైన అభిమానం దేవాలయాల మీద రాజకీయ నాయకులు ఓట్లు రూపంలో క్యాష్ చేసుకుంటున్నారు , ఇలా కేంద్రం దేవాలయాలని ఆధీనంలోకి తీసుకుంటే ఇక మత పరమైన గొడవలకి తావు ఉండడమో , అలాగే రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాల మీద వచ్చే ఆదాయాన్ని కోల్పోతుంది.