వెంకటేష్ కూతురి తో చైతు సందడి

అక్కినేని నాగ చైతన్య..తన మేనమామ అయిన దగ్గుబాటి వెంకటేశ్ కుమార్తె అశ్రితతో సందడి చేసాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా ఉన్న చైతు..మొదటి నుండి కూడా సోషల్ మీడియా కు దూరంగా ఉంటాడు. తన సినిమా రిలీజ్ టైం లోనే కాస్త పోస్టులు చేస్తుంటాడు. ఆ తర్వాత అంతే సంగతి. అయితే తాజాగా వెంకీ కూతురు అశ్రితతో సందడి చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.
రీసెంట్ గా విదేశాల నుండి ఇండియా కు వచ్చిన అశ్రిత .. చైతూకు చెందిన క్లౌడ్ కిచెన్ షోయుకు వచ్చింది. అక్కడ తయారు చేస్తున్న ఫుడ్, ఇతర వివరాలను చైతూను అడిగి తెలుసుకుంది. అశ్రిత ఓ ఫుడ్ వ్లాగర్. ‘ఇన్ఫినిటీప్లాటర్’ వేదికగా పలు రకాల వంటకాలను అందరికీ పరిచయం చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే క్లౌడ్ కిచెన్‌లో అశ్రిత ఓ డిష్‌ను తయారు చేసి తన బావకు రుచి చూపించింది. ఇందుకు సంబంధించిన వీడియో అశ్రిత సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఇక నాగ చైతన్య సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో కస్టడీ అనే సినిమాను చేస్తున్నాడు. చైతన్య బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది.