సమంత ను చైతు కలవాలని అనుకుంటున్నాడట..

సమంత ను చైతు కలవాలని అనుకుంటున్నాడట..

సమంత – నాగ చైతన్య ప్రేమించి పెళ్లి చేసుకొని , కొంతకాలానికే విడిపోయిన సంగతి తెలిసిందే. విడిపోయిన తర్వాత ఎవరికీ వారు ఉంటూ సినిమాలతో బిజీ గా ఉన్నారు. అయితే చైతు హ్యాపీ గానే ఉన్నప్పటికీ సామ్..మాత్రం మయోసైటిస్ అనే ప్రాణాంతకమైన వ్యాధి తో పోరాడుతుంది. ఈ వ్యాధి బారిన పడినట్లు సామ్ తెలుపగానే అంత షాక్ కు గురై ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆమెకు ధైర్యం చెప్పారు. అయితే మాజీ భర్త చైతు మాత్రం సామ్ ను పట్టించుకోలేదు.

కాగా ఇప్పుడు సమంత ను కలవాలని చైతు భావిస్తున్నాడట. ప్రస్తుతం సామ్ కు చికిత్స అందిస్తున్న వైద్యులు ఈ వ్యాధికి దక్షిణ కొరియాలో బెటర్ ట్రీట్మెంట్ ఉందని సలహా ఇచ్చారట. వారి సలహా మేరకు సమంత దక్షిణాఫ్రికాలో వెళ్లినట్లు సన్నిహిత వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. త్వరలో సమంత తిరిగి ఇండియా రానున్నారు. సమంత హైదరాబాద్ వచ్చాక నాగ చైతన్య ఆమెను నేరుగా కలవనున్నారట. సమంతను పరామర్శించి హెల్త్ గురించి వాకబు చేస్తారట. నాగ చైతన్య సన్నిహితులు ఈ మేరకు ఆయన్ని కన్విన్స్ చేశారట. భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న సమంతను ఇగోలు పక్కన పెట్టి కలవాలని నచ్చజెప్పారట. ఈ క్రమంలో సమంతను త్వరలో నాగ చైతన్య కలవడం ఖాయం అంటున్నారు. మరి నిజం గానే చైతు ..సామ్ ను కలుస్తాడా..లేదా అనేది చూడాలి.

follow us