ముగిసిన చలపతిరావు అంత్యక్రియలు

ముగిసిన చలపతిరావు అంత్యక్రియలు

నటుడు చలపతిరావు అంత్యక్రియలు జుబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో పూర్తియ్యాయి. చలపతి కుమారుడు రవిబాబు తన తండ్రికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఆదివారం చలపతి రావు (78) గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. 1200కి పైగా చిత్రాల్లో తనదైన నటన తో ఆకట్టుకునే ఈయన్ను..చిత్రసీమలో ముద్దుగా బాబాయ్ అని పిలుస్తుంటారు.

1944 మే 8న కృష్ణా జిల్లా బ‌ల్లి ప‌ర్రులో చ‌ల‌ప‌తిరావు జ‌న్మించారు. ఈయ‌న‌కు ఇద్ద‌రు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. కాగా అమెరికా లో ఉంటున్న ఆయన కుమార్తెలు రాక ఆలస్యం కావడం తో ఆయన భౌతికకాయాన్ని రెండు రోజులుగా మహాప్రస్థానంలోని ఫ్రిజర్ బాక్స్ లో ఉంచారు. కుమార్తెలు రావడం తో బుధవారం ఆయన భౌతకకాయాన్ని మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్య క్రమంలో కుటుంబసభ్యులు.. కుమర్తెలతోపాటు.. హీరో మంచు మనోజ్, నిర్మాత సురేష్ బాబు, నిర్మాత దామోదర ప్రసాద్, రచయిత పరుచూరి గోపాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను, డైరెక్టర్ శ్రీవాస్, నటుడు గౌతమ్ రాజు.. తదితరులు హాజరయ్యారు.

follow us