టీడీపీ నేతలతో చంద్రబాబు అత్యవసర భేటీ

ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యకుడు నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై చంద్రబాబు నేతలతో చర్చించనున్నారు. నిన్న చంద్రబాబు ఇసుక కోసం చేసిన దీక్ష కి ప్రజల నుండి అనూహ్య స్పందన వచ్చింది, అయితే కోదిరోజుల వరకు టీడీపీ లో ఉన్న వల్లభనేని వంశీ , దేవినేని అవినాష్ వైస్సార్సీపీ లో చేరారు .
చేరడమే కాకా టీడీపీ అనేక ఆరోపణలు చేశారు , ఇంకా వల్లభనేని వంశీ ఒక మెట్టు దిగి ఒక ప్రముఖ ఛానల్ లైవ్ లో రాజేంద్ర ప్రసాద్ ని పార్టీ ఎలక్షన్స్ టైంలో పంచిన డబ్బుల గురించి , చంద్రబాబు పని తీరు గురించి , పార్టీ లో నాయకులకు ఇచ్చే విలువ గురించి మాట్లాడారు , ఇంకా రాజేంద్ర ప్రసాద్ ని బండ బూతులు కూడా తిట్టారు . వీటి అన్నిటిపై టీడీపీ నాయకులతో చంద్రబాబు భేటీ కానున్నారు.
ఇంకా చంద్రబాబు నాయుడు ఎంపీలతో కూడా భేటీ కానున్నారు , పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు.