నితిన్ దర్శకుడితో ప్రభాస్ సినిమా ..?

  • Written By: Last Updated:
నితిన్ దర్శకుడితో ప్రభాస్ సినిమా ..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా లెవల్ వే కావడం విశేషం. వాటిలో ఇప్పటికే రాధే శ్యామ్ షూటింగ్ పూర్తి కాగా కేవలం ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలి ఉంది. అంతే కాకుండా ఆది పురుష్, సలార్ సినిమాలు షూటింగ్ దశలోనే ఉన్నాయి. మరోవైపు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ప్రాభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది.

అయితే తాజా సమాచారం ప్రకారం టాలెంటెడ్ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి ప్రభాస్ తో ఓ సినిమా చేయానుకుంటున్నారట. ప్రస్తుతం యేలేటి ప్రభాస్ కోసం కథను సిద్ధం చేస్తున్నారట. స్క్రిప్ట్ పూర్తి కాగానే ప్రభాస్ కు వినిపించాబోతున్నారు. అంతే కాకుండా ఈ కథ ప్రభాస్ ఇమేజ్ కు సరిపోయేలా సిద్ధం చేస్తున్నారట. ఒకవేళ ప్రభాస్ ను ఇంప్రెస్ చేయగలిగితే సలార్, ఆది పురుష్ మరియు నాగ్ అశ్విన్ సినిమా పూర్తయ్యాక ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.

follow us