మెగా పవర్ స్టార్ బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకోలేకపోయాడు

మెగా పవర్ స్టార్ బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకోలేకపోయాడు

చిత్రసీమలో డైరెక్టర్స్ కథలు రాసుకునే ముందు ఓ హీరోను అనుకోని కథ సిద్ధం చేస్తుంటారు..కథ అంత పూర్తియ్యాక..తీరా ఆ హీరోకు చెపితే కథ నచ్చలేదని చెప్పి..వెనక్కు పంపిస్తారు. దీంతో మరో హీరోకు అదే కథను చెప్పి హిట్స్ కొడుతుంటారు. అయితే అన్ని సందర్భాలలో అది వర్క్ అవుట్ కాదు..కొన్నిసార్లు ప్లాప్ అయినదాఖలు కూడా ఉన్నాయి. తాజాగా రవితేజ కూడా ఆలా వేరే హీరో కథ ఈయన చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.

తాజాగా రవితేజ నటించిన ధమాకా మూవీ గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న రవితేజ కు ఈ మూవీ బూస్ట్ ఇచ్చినట్లు అయ్యింది. ముందుగా డైరెక్టర్ త్రినాద్..ఈ కథను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు వినిపించాడట. అయితే ఈ కథ చరణ్ కు నచ్చలేదట. దీంతో అదే కథను రవితేజ చెప్పి ఓకే చేయించుకున్నాడు. సెట్స్ పైకి తీసుకరావడం..ఇప్పుడు భారీ హిట్ కొట్టడం జరిగింది. ఈ విషయం తెలిసి మెగా అభిమానులు తెగ ఫీల్ అవుతున్నారట. చరణ్ ఈ మూవీ చేసేయి ఉంటె బాగుండని మాట్లాడుకుంటున్నారు.

follow us