శ్యామ‌ల భ‌ర్త‌పై చీటింగ్ కేసు..మోసం చేసాడంటూ మ‌హిళ ఫిర్యాదు.!

  • Written By: Last Updated:
శ్యామ‌ల భ‌ర్త‌పై చీటింగ్ కేసు..మోసం చేసాడంటూ మ‌హిళ ఫిర్యాదు.!

ప్ర‌ముఖ యాంకర్ శ్యామల భర్త నర్సింహారెడ్డి పై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు న‌మోదైంది. కోటి రూపాయలు తీసుకొని తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడంటూ ఓ మ‌హిళ న‌ర్సింహారెడ్డి పై ఫిర్యాదు చేసింది. 2017 నుండి ఇప్పటి వరకు విడతల వారిగా న‌ర్సింహులు డబ్బు తీసుకునట్లు మ‌హిళ ఫిర్యాదులో పేర్కొంది. అంతే కాకుండా డబ్బుల విషయం అడిగితే నర్సింహారెడ్డి బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్న‌ట్టు ఫిర్యాదులో పేర్కొంది. డబ్బులు తీసుకోవడమే కాకుండా సెక్సువల్ అభ్యుస్ కు సైతం పాల్పడినట్లు బాధితురాలి ఫిర్యాదు చేసింది.

మ‌రోవైపు సెటిల్ మెంట్ చేసుకోవాలంటూ ఈ కేసులో నర్సింహారెడ్డి తరపున ఓ మ‌హిళ రాయ‌బారం నడుపుతున్న‌ట్టు ఫిర్యాదులో పేర్కొంది. మ‌హిళ ఫిర్యాదు మేర‌కు కేసు నమోదు చేసుకున్న రాయదుర్గం పోలీసులు…నర్సింహారెడ్డి తో పాటు రాయబారం నడిపిన మహిళను రిమాండ్ కి తరలించారు. ఇదిలా ఉండ‌గా శ్యామ‌ల యాంకర్ కాగా నర్సింహారెడ్డి సీరియ‌ల్స్ లో న‌టిస్తుంటారు. శ్యామ‌లకు మొద‌ట‌గా న‌ర్సింహారెడ్డి ప‌రిచ‌యమైంది కూడా ఓ సీరియ‌ల్ షూటింగ్ లోనే..వీరిమ‌ధ్య ప‌రిచ‌యం ప్రేమ‌గా మ‌రడంతో పెళ్లి చేసుకున్నారు.

follow us

Related News