తెలంగాణ కు బారి నష్టం : కేసీఆర్ ఎందుకు ప్రశ్నించరు ?

Huge loss for Telangana
Huge loss for Telangana

కేంద్ర పన్నుల పంపిణీలో రాష్ట్రాలు నష్టపోతున్నాయని అన్నారు కేంద్ర మాజీ ఆర్థికశాఖ మంత్రి పి. చిదంబరం… హైదరాబాద్‌లో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. రూ.8.5 లక్షల కోట్లకు గాను కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలకు రూ.6.5 లక్షల కోట్లే పంచిందని ఆరోపించారు. కేంద్రం తీరుతో తెలంగాణ పన్నుల వాటాలో రూ.5 వేల కోట్లు నష్టపోయిందని వెల్లడించారు చిదంబరం.. అయితే, తెలంగాణ సీఎం కేసీఆర్ ఓ సారి ప్రధాని మోడీకి అనుకూలంగా.. మరోసారి వ్యతిరేకంగా మాట్లాడుతారన్న ఆయన.. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై కేసీఆర్ ఎందుకు ప్రశ్నించరు.? అని నిలదీశారు. 

హైదరాబాద్‌లో నిన్న సాయంత్రం రోడ్డువెంట ఉన్న బ్రాండెడ్ కంపెనీల షో రూమ్స్ చూశాను.. కస్టమర్లు లేకుండా కనిపించాయన్నారు చిదంబరం.. అయితే, హైదరాబాద్‌లో మాత్రమే కాదు… చెన్నైలో కూడా ఇదే పరిస్థితి ఉందన్నారు. కొనుగోలు చేసేవాళ్లు లేకుండాపోయారు.. ప్రజల చేతిలో డబ్బు లేకుండా పోయిందన్న ఆయన.. ఆటో మొబైల్ రంగం బాగుంటే దేశ ఆర్థిక పరిస్థితి పరిపుష్టిగా ఉంటుంది.. ఆటో మొబైల్ రంగం ఇప్పుడు దేశంలో నాలుగు రోజులే పని చేస్తుందని విమర్శించారు. వ్యాపార వేత్తలు ఇప్పుడు టాక్స్ వేధింపులతోనే ఉన్నారు.. టాక్స్ చెల్లింపు దారులకు వేధింపులు ఎక్కువయ్యాయని ఆరోపించారు చిదంబరం.