16 ఎకరాల్లో ఆచార్య షూటింగ్ ! బడ్జెట్ ఎంతో తెలుసా ?

16 ఎకరాల్లో ఆచార్య షూటింగ్ ! బడ్జెట్ ఎంతో తెలుసా ?

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో “ఆచార్య” చిత్రం తెరకెక్కుతుంది. లాక్ డౌన్ కు ముందు కొంత బాగం వరకు టాకీ పార్టు ను పూర్తి చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం సినిమా షూటింగ్ లకు పర్మిషన్ ఇవ్వడంతో ఈ మధ్యనే షూటింగ్ ను ప్రారంబించింది. ప్రస్తుతం ఈ చిత్రంలోని ప్రదాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఓ మాజీ నక్షలైట్ గా చరణ్ కనిపిస్తాడని సినీ వర్గాల కథనాలు. బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. కాజల్ అగర్వాల్ చిరంజీవి కి జోడీగా నటిస్తుంది. రెజిన ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించబోతుంది.

ఈ చిత్రంను 83 కోట్లు పెట్టి మరి నిర్మిస్తున్నారు. తాజా సమాచారం మేరకు హైదరాబాద్‌ శివారు ప్రాంతంలో “ఆచార్య” సినిమా షూటింగ్‌ కోసం 16 ఎకరాల్లో అతి విశాలమైన సెటింగ్‌ ను నిర్మిస్తున్నారు. దాని విలువ రూ.20 కోట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ సెట్ నిర్మాణం కొరటాల శివ ఆద్వర్యంలో జరుగుతుంది. ఈ సినిమాలోని మెజార్టీ పార్ట్‌ అందులోనే చిత్రీకరించబోతున్నట్లుగా తెలుస్తుంది. “ఇస్మార్ట్ శంకర్” సినిమా తో మరలా ఫామ్ లోకి వచ్చిన మణిశర్మ “ఆచార్య” చిత్రంకు స్వరాలు అందిస్తున్నాడు. ఈ చిత్రంను రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి కలిసి నిర్మిస్తున్నారు.

follow us