నిహారికా కు పెద్దనాన్న ఆశీర్వాదం !

నిహారికా కు పెద్దనాన్న ఆశీర్వాదం !

నాగబాబు కూతురు నిహారికా వివాహం చైతన్య తో ఈ నెల 9న ఉదయ్ విలాస్ లో జరుగుతుంది. గత వారం రోజులుగా మెగా ఫ్యామిలీ ఈ పెళ్లి పనుల్లో బిజీగా ఉంది. మెగా డాటర్ నిహారికా మాత్రం తన పెళ్లి విషయమై ప్రతి విషయాన్ని తన ఇంస్టా గ్రామ్ ద్వారా అందరికి షేర్ చేస్తుంది. మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ మొత్తం తమ తమ ఓన్ జెట్స్ వేసుకొని ఇప్పటికే వివాహ వేధిక వద్దకు చేరుకుంది. సంగీత్ అంటూ పార్టీ లంటూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. నిహారికా పెళ్లి విషయమై రోజుకో ట్విస్ట్ ఇస్తూ పోస్ట్ చేస్తుంది.

మొన్న శనివారం నాడు నిహారికా తన అమ్మ 32 ఏళ్ల కింద ధరించిన నిశ్చితర్థాపు చీరను కట్టుకుంది. అప్పుడు వాల్ల అమ్మ దిగిన ఫోటో ను అదే చీర కట్టుకొని ఇప్పుడు నిహారికా దిగిన ఫోటోను జత చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫోటో కాస్త వైరల్ గా మారింది. మెగా స్టార్ చిరంజీవి కూడా నిహారికా తరహాలోనే తను చిన్నపుడు నిహారికను ఎత్తుకొని దిగిన ఫోటోను.. నిహారికా పెళ్లి కూతురు గా ముస్తాబై తనతో సెల్ఫి దిగిన ఫోటోను జత చేసి, ట్విటర్ వేదికగా పోస్ట్ చేస్తూ… మా చేతిలో పెరిగిన మా చిన్నారి నిహారికని, చైతన్య చేతిలో పెడుతున్న ఈ శుభతరుణంలో, ముందస్తుగా, కాబోయే దంపతులకు నా శుభాకాంక్షలు , ఆశీస్సులు. God bless you!అంటూ తెలియజేశాడు. ఈ సందర్భంగా మెగా ఫ్యాన్స్ అందరూ నిహారికా దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

follow us