‘గాడ్ ఫాదర్’ ఫస్ట్ లుక్ విడుదల, దసరాకి థియేట్రికల్ రిలీజ్

‘గాడ్ ఫాదర్’ ఫస్ట్ లుక్ విడుదల, దసరాకి థియేట్రికల్ రిలీజ్

ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్‌ఫాదర్‌’ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. చిరంజీవి తొలిసారి సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో, బ్లాక్ షేడ్స్ ధరించి, కుర్చీలో కూర్చొన్న ఫస్ట్ లుక్ పోస్టర్ మెగా మార్వలెస్ గా వుంది.
చిరంజీవి పాత్రను పరిచయం చేసే గ్లింప్స్ వీడియో ఎక్స్ టార్డినరీగా వుంది. ఒక కార్యాలయం వెలుపల వేలాది మంది పార్టీ కార్యకర్తలు అతని కోసం వేచి ఉండగా, మెగాస్టార్ చిరంజీవి అంబాసిడర్ కారులో రావడం, సునీల్ కార్ డోర్ తీయగా గాడ్ ఫాదర్ గా చిరంజీవి కారు నుండి బయటకు వచ్చి, ఆఫీస్‌ లోకి ఫిరోషియస్ గా నడుచుకుంటూ వచ్చారు. గాడ్ ఫాదర్ టైటిల్ మెగాస్టార్ ఆహార్యాన్ని చక్కగా నప్పింది. ఈ గ్లింప్స్ వీడియోకి థమన్ ఇచ్చిన బీజీఎం అద్భుతంగా వుంది, పాత్రని మరింత ఎలివేట్ చేసింది. గాడ్ ఫాదర్ లో మెగా స్టార్ చిరంజీవి లుక్ అన్ని వర్గాల ప్రేక్షకులు కన్నుల పండగలా వుంది.

గాడ్‌ఫాదర్‌ను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తుండగా, ఆర్‌బి చౌదరి , ఎన్‌వి ప్రసాద్ నిర్మిస్తున్నారు. కొణిదెల సురేఖ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

కేఆర్ క్రియేషన్స్ పతాకంపై సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో హీరో సుమంత్ కొత్త చిత్రం

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రముఖ పాత్రలో నటిస్తుండగా, నయనతార కీలక పాత్రలో కనిపించనుంది. పూరి జగన్నాధ్, సత్యదేవ్ ఇతర ముఖ్య పాత్రలలో కనిపించననున్నారు.

టాప్ సినిమాటోగ్రాఫర్ నీరవ్ షా ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, సురేష్ సెల్వరాజన్ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.

ఈ ఏడాది దసరా సందర్భంగా గాడ్‌ఫాదర్‌ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.

follow us